అది ఒక గ్రామం… ఆ గ్రామం అనుకొని ఒక దట్టమైన అడవి ఉంది. ఆ గ్రామం నుండి వేరే ప్రదేశానికి వెళ్లడానికి బస్సులు చాలా తక్కువగా వెళ్తాయి…. అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది… ప్రయాణికులు ఒక పాత బస్టాండ్ దగ్గర బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.. అది ఆ రోజుకి చివరి బస్సు… ఆ బస్సు ఓ భారీ అడవి గుండా ప్రయాణించి.. చాలా దూరం వెళ్లి ఒక గ్రామం దగ్గర ఆగుతుంది. ఆ బస్సు ఎక్కడానికి బస్టాండ్ వద్ద ఒక నర్స్ ఒక వ్యాపారి ఒక విద్యార్థి డ్యూటీని ముగించుకుని వెళ్తున్న ఒక ఫారెస్ట్ గాడ్ మరియు ఒక విద్యార్థి తన తల్లిదండ్రులతో వేచి ఉన్నారు.. ఆ చివరి బస్సులో ప్రయాణించడానికి బస్సు కోసం ఎదురుచూస్తున్నారు.. బస్సు రానే వచ్చింది. బస్సులో అందరూ ఎక్కి కూర్చున్నారు.. బస్సు డ్రైవర్ రాము అలాగే బస్సు కండక్టర్ శ్రీను బస్సు వెళ్ళటానికి అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో అని చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఊరి నుంచి బయలుదేరే చివరి బస్సు కాబట్టి ఏదైనా జరగకుండా ఉండాలని.. బస్సు స్టార్ట్ చేసే ముందు ప్రయాణికులకు ఈ బస్సు ఒక భారీ అడవిగుండా ప్రయాణిస్తుంది… అక్కడ ఏదైనా అపాయం ఉండొచ్చు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి.. అని బస్సు కండక్టర్ మరియు డ్రైవర్ హెచ్చరిస్తారు. ఆ మాటల్ని ఎవరూ పట్టించుకోరు అప్పుడు సమయం రాత్రి పది అవుతుంది. అలా బస్సు మొదలయింది. బస్సు కొంత దూరం వెళ్ళాక అక్కడ దారిలో ఒక చెట్టు పడిపోయి. ఉంది.. అప్పుడు డ్రైవర్ రాము ఏం చేయాలో తెలియక వేరే దారి గుండా బస్సును తీసుకెళ్తాడు. ఆరోజు అమావాస్య కావడంతో చుట్టూ అంతా చీకటి… ఆ బస్సు వెలుతురు చెట్లు చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ బస్సు కొంచెం దూరం వెళ్ళాక ఒకానొక సమయంలో ఆగిపోతుంది..!
ఆ బస్సు ఇంజన్ ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవటం లేదు అది చూద్దామని రాము కిందకు దిగుతాడు.. కండక్టర్ ఆ బస్సులోని ప్రయాణికులతో ఉన్నాడు.. డ్రైవర్ ఆ బస్సును రిపేర్ చేద్దాం అంటే చుట్టూ చీకటి.. అతని దగ్గర ఉన్న టార్చ్ లైట్ తో చెక్ చేస్తాడు. అంత బాగానే ఉంది కదా ఎందుకు స్టార్ట్ అవటం లేదు అని డ్రైవర్ అనుకుంటాడు.. మళ్లీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు కానీ స్టార్ట్ అవడం లేదు.. ఏమైందో డ్రైవర్ కు అస్సలు అర్థం కావడం లేదు.. అప్పుడు ఒక మనిషి అరుస్తున్న శబ్దం వినిపించింది.. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు.. ఇది చాలా భయంకరంగా ఉంది.. అందులో ఉన్న చిన్న పిల్లవాడు చాలా భయపడతాడు… తన తల్లిని గట్టిగా పట్టుకుంటాడు.. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఎమి అర్థం కావడం లేదు. అప్పుడు అందులో ఉన్న ఫారెస్ట్ గాడ్ మీరుభయపడకండి అది ఒక జంతువు అరుపు కావచ్చు… అని వారికి ధైర్యం చెబుతాడు…
మళ్లీ అరుపులు వినిపిస్తున్నాయి… ఆ బస్సు దగ్గర నుంచి ఎవరు అమ్మాయి గజ్జల శబ్దం వినిపిస్తుంది.. ఆ శబ్దం ఏంటని అందులో ఉన్న ఒక నర్స్ తన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి ఒక టార్చ్ లైట్ తీసుకొని బస్సు దిగుతుంది.. ఆ టార్చ్ లైట్ వెలుతురు ఎవరో అక్కడ ఉన్నట్లు కనిపిస్తారు. అది ఏంటి అని దగ్గరికి వెళ్లి చూస్తే అది ఒక భయంకరమైన రూపం…. అది చూసిన నర్సు దాన్ని చూసి చాలా భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి బస్సులో కూర్చుంటుంది.. బస్సు డ్రైవర్ మరియు కండక్టర్ కూడా దాన్నీ చూసి చాలా భయపడిపోతారు.. ఆ విషయము అందరికి చెప్తారు….
అది విన్న అందరూ చాలా భయపడి వనికి పోతూ ఉంటారు.. ఉన్న ఫారెస్ట్ గాడి దగ్గర ఒక గన్ ఉంది. కనులు పట్టుకొని కొంచెం ధైర్యంగా ఉన్నారు. బస్సు లోపల ఉన్న వ్యాపారి దగ్గర ఒక చిన్న బంగారు బిల్లా నాణ్యముంది. అది పట్టుకుని చాలా భయంతో ఉంటాడు. వీరందరి కంటే ధైర్యవంతుడు ఆ కాలేజ్ స్టూడెంట్ మాత్రమే.. ఒకవైపు అమ్మానాన్న తన బిడ్డకు ఏమైనా అవుతుందేమో అని చాలా భయంతో ఉంటారు..
అప్పుడే ఆ దయ్యం భయంకరంగా అరుస్తూ ఆ బస్సు దగ్గరికి వస్తుంది..
ఆ దయ్యం అందరిని చంపేస్తుంది అని ఫారెస్ట్ గార్డు అందరు కిందకు దిగి పారిపోండి అని చెప్తాడు.. వారందరూ కిందకి దిగి పారిపోతూ ఉంటారు. ఇప్పుడు ఆ దయ్యం డ్రైవర్ రాము దగ్గరికి వచ్చి అతడిని చంపేస్తుంది.. ఫారెస్ట్ గార్డు ఆ దయ్యంపై గన్నుతో కాలుస్తూ ఉంటాడు .. ఆ దయ్యానికి ఏమీ కాదు. ఆ దయ్యం ఫారెస్ట్ గాడ్ దగ్గరికి వెళ్లి అతనిని చంపేస్తుంది.. అలా ఆ దయ్యం ఒక్కొక్కరిని చంపడం మొదలుపెడుతుంది.. నర్స్ తన దగ్గర ఉన్న టార్చ్ పడేసి అలాగే వ్యాపారి కూడా ఆ నర్స్ వెనకల పరిగెడతాడు… ఆ వ్యాపారి తన దగ్గర ఉన్న దేవుడు బొమ్మను పోగొట్టుకుంటాడు.. దయ్యం వారిద్దరు వెనక్కి వెళ్లి వారిద్దరిని చంపేస్తుంది.. టార్చ్ లైట్ మరియు ఆ దేవుడు బొమ్మ రవికి దొరుకుతుంది.. అలాగే శ్రీను కూడా చనిపోతాడు.. ఆ రవి ఆ దేవుడు బొమ్మను ఆ దెయ్యానికి చూపించి ఆ పిల్లవాడిని తన తల్లిదండ్రులను దగ్గరికి తీసుకుంటాడు.. ఇప్పుడు ఆ దయ్యం అక్కడ నుంచి మాయమవుతుంది.. అప్పుడు రవి వారిని తీసుకొని అడవిలోకి పరిగెడతాడు.. ఒక పురాతనమైన గుడి కనిపించింది వారికి… అక్కడికి వారు పరిగెడుతూ ఉన్నారు .. అపుడు ఆ దయ్యం భయంకరంగా అరుస్తూ వెనుక వస్తుంది… వారు ఆ గుడిలోకి చేరుకుంటారు.. చేరుకున్న వెంటనే దయ్యం అనేది మాయమవుతుంది… అప్పుడు వారు కొద్దిగా ఊపిరి తీసుకుంటారు… వారు కొద్దిసేపు ఉంటే ఉదయం కాగానే వెళ్ళిపోదామని అనుకుంటారు.. ఉదయం కాగానే రవి గుడి నుంచి బయటికి వస్తాడు.. అక్కడ రాత్రి మరణించిన వారు ఎవరు కూడా ఉండరు… ఆ బస్సు మాత్రమే అక్కడ ఉంటుంది..
అప్పుడు ఆ రవి ఆ బస్సు ని స్టార్ట్ చేయడానికి చూస్తాడు కానీ అది స్టార్ట్ అవ్వదు ఎందుకంటే ఆ బస్సులో డీజిల్ కు బదులుగా కండక్టర్ రాము మరియు శ్రీను యొక్క రక్తం ఉంది.. అక్కడ కేవలం శ్రీను మరియు రాముడు యొక్క బాడీ మాత్రమే ఉంటాయి. మిగతావారు ఎవరు ఉండవు.. ఎందుకంటే.. దయంగా మారిన ఆ పిశాచి చనిపోవడానికి కారణమైన వారు ఈ డ్రైవర్ మరియు శీను… కానీ మిగతా వారందరు ఎక్కడ అని రవి చాలా ఆశ్చర్యపోయాడు..
ఇక్కడ వాళ్ళందరికీ తెలిసిందేమిటంటే వారందరూ కూడా బ్రతికే ఉన్నారని తెలిసింది… ఇక్కడి నుంచి రవి ఆ పిల్లవాడు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ తన గ్రామానికి వెళ్లిపోయారు…
ఈ వీడియో నచ్చినట్లైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని షేర్ చేయండి