అది జూన్ 16 2013 రాత్రి సమయం 7:30 అవుతుంది. మూడు రోజుల నుంచి కేదార్నాథో భారీ వర్షాలు పడుతున్నాయి. దేశంలో ఎంతోమంది టూరిస్ట్ ఇంకా దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇది ఒక సాధారణ వర్షం ఎప్పుడు పడుతుంది అని అనుకున్నారు. వాళ్లు తమ హోటల్స్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆ హోటల్స్ పక్కన మందాకిని అనే నది ఉంది.కానీ అక్కడ ఉండే లోకాల్స్ వాళ్లందరికీ తెలుసు ఇలాంటి భారీ వర్షం ఎప్పుడు పడలేదు అని. కొండపోతుగా వస్తున్న ఆ వర్షాన్ని చూసి చాలా భయపడుతున్నారు.ప్రతి నిమిషం నిమిషం కు వర్షం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు సమయం 8:10 అయింది ఆ నది పక్కన ఉన్న మూడంతస్తుల భవనం ఓనర్ హడావిడిగా అందరి రూమ్ తలుపులు కొడుతున్నారు. వాళ్లు రూమ్ డోర్ తెరిచిన తర్వాత భయపడుతూ ఓనర్ మందాకిని ఓవర్ ఫ్లో అవుతుంది నీళ్లు ఫస్ట్ ఊర్లో కూడా వచ్చేసాయి మీరు ఏదైనా సేఫ్ ప్లేస్ లోకి వెళ్ళండి అని చెబుతాడు. లాడ్జి ఓనర్ వచ్చి ఇలా చెప్పడంతో వాళ్లందరూ షాక్ అయ్యారు. అందరూ వాళ్లకు వీలైనంత త్వరగా ఎత్తయిన ప్రదేశాల్లోకి వెళుతున్నారు.
ఇంకా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా అందరూ ఎత్తైన ప్రదేశాల్లోకి వెళుతున్నారు. ఇప్పుడు సమయం 8:30 అయింది. ఒక్కసారిగా పెద్ద మెరపు శబ్దం అందరికీ వినపడింది ఆ శబ్దం ఎటు నుంచి వస్తుంది అని చూసే లోపల ఆ నది మొత్తం కేదార్నాథ్ ని ముంచేసింది. టూరిస్టులు ఉన్న లాడ్జిలు అన్ని వాళ్ల కళ్ళ ముందే మునిగిపోతున్నాయి.కొంతమంది ముసలి వాళ్లు చేత కాకపోవడం తో ఆ నీటిలో కొట్టుకొని పోయారు. ఆ విసుల్స్ అన్ని చూసిన వాళ్ళకి నోట్లో నుంచి మాట కూడా రావడం లేదు .ఒక్కసారిగా ఈ వరద కేదార్నాథ్ నుండి కింద ఉన్న రభర అనే ఊరిలో దూసుకు వెళ్ళింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు వాళ్ళందరూ నీళ్లలో కొట్టుకొని పోతున్నారు. తనకు అడ్డు వచ్చిన ప్రతి వస్తువుని ఆ వరద తుడిచిపెట్టుకుంటూ వెళ్ళింది. ఇది కేవలం ఫస్ట్ వేవ్ మాత్రమే. ఇంకా సెకండ్ వేవ్ ఉంది కేదార్నాథ్ మీద ఒక్కసారిగా భారీ సంఖ్యలో నీళ్ళు విరుచుకుపడ్డాయి. కేదార్నాథ్ లో ఉన్న రాళ్లు ఇంకా శిల్పాలు ఆ నీటిలో కలిసి రాబరా వైపు కొట్టుకొని పొత్తున్నాయి. అక్కడ ఫస్ట్ వేవ్ లో మిగిలిపోయి ఉన్న భవనాలు కూడా సెకండ్ వేవ్ లో అన్ని పడిపోయాయి ఆ బండరాలు అన్ని నదిలో కలిసిపోయాయి. అంతా అయిపోయిన తర్వాత ఆ వర్షం ఆగిన తర్వాత ఆ బురదలో షవాలు అన్ని కలిసిపోయాయి. ఇలా ఈ వరదలు రావడం వల్ల మొత్తం అక్కడ 6000 మంది చనిపోయి ఉన్నారు.
అపుడే ఈ వార్త ప్రపంచవంతటా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. ఆ వరదలు రావడం వల్ల అక్కడ ఉన్న షాపులు లాడ్జిలు అన్ని కూలిపోయాయి. కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం ఏమి కాలేదు.ఆ గుడి లోపల ఉన్న శివలింగానికి కానీ ఆ గుడి ఎదురుగా ఉన్న నందికి ఏమి జరగలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే కేదార్నాథ్ ఆలయం కంటే బలమైన బిల్డింగులు కూలిపోయాయి. కానీ ఈ గుడి వరదలో కొట్టుకుపోకుండా ఉండడానికి ఒక సైంటిఫిక్ రీసన్ ఉంది.ఫస్ట్ వేవ్ లో ఒక కొండ విరిగి ఆ నీటిలో పడిపోయింది.ఆ కొండ వచ్చి కేదార్నాథ్ ఆలయం కు వెనకాల 20 అడుగుల దూరంలోనే పడి ఉంది. ఈ పెద్ద రాయి అడ్డం ఉండడం వలన ఆ గుడికి ఎలాంటి డామేజ్ కాలేదు. కొంతమంది ఆ రాయిను
“భీమ్ శిలా”భీముడి యొక్క పవిత్రమైన రాయి అని కూడా అంటారు. అప్పటినుంచి కొంతకాలం గుడి మూసుకుపోయి ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడితోపాటు ఆ రాయిని కూడా పూజించడం మొదలుపెట్టారు.
కేదార్నాథ్ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే? అక్కడ ఉండే వాతావరణం. మంచు కొండలు, శివుడు మన భారతదేశంలో 12 చోట్ల శివ లింగంలా వెలిశాడు. వాటిని మనం 12 జ్యోతిర్లింగాలు అంటాం. ఆ 12 వాటిలో ఇది 11 వ శివలింగం అంతేకాదు ఈ ఆలయాన్ని పాండవుల నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి.ఇలాంటి అద్భుతమైన కేదార్నాథ్ టెంపుల్ గురించి ఇప్పుడు పూర్తిగా చరిత్ర తెలుసుకుందా…..ఈ ఆలయం ఉత్తరాఖండ్లో రుద్ర ప్రయాగ అని ప్రదేశం లో ఉంది. ఆ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్ ఈ ప్రదేశానికి దగ్గరలో ఉంది. భారతదేశంలో పురాతనమైన మందిరాలలో కేదార్నాథ్ ఆలయం ఒకటి. సముద్ర స్థలం నుంచి 3584 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ మందిరం ఆరడుగుల స్టోన్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడి ఉంది. ఈ మందిరం ముందు ఒక అందమైన నంది ఉంటుంది. ఇంకా ఆలయం ముఖ్య ఆ భాగంలో ఒక పెద్ద మందిరం నిర్మించబడి ఉంది. దీన్ని పాండవుల నిర్మించారు అని మన పురాణాలు చెబుతున్నాయి. గర్భగుడిలో పిరమిడ్ షేప్ లో ఉన్న ఒక లింగం కొలువై ఉంది. ఇలాంటి లింగం ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఆ శివలింగం వెనక ఉన్న రహస్యం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మహాభారతం యుద్ధమంతా అయిపోయిన తర్వాత పాండవులకు ఎక్కడ ప్రశాంతత ఉండదు. యుద్ధం అయిపోయిన తర్వాత చాలా కాలం హస్తినాపురం రాజు లాగా పాండవులు పాలించారు. ఎంత కాలం అయినా కూడా తమకు బాధ తగ్గలేదు.దీని పరిష్కారం కోసం పాండవులంతా వేద వ్యాసుడి దగ్గరికి వెళ్లారు. పాండవులంతా వారి బాధను వేద వ్యాసుడితో చెప్పుకున్నారు.
అప్పుడు వేదవాసుడు మీరు మీ పాపాల నుంచి విముక్తి పొందాలంటే శివుడిని దర్శించుకోండి అని చెబుతాడు. అప్పుడు శివుడిని దర్శించుకోవడానికి కాశీకి వెళ్తారు. కానీ అక్కడ నుండి శివయ్య మాయమవుతాడు. కాశీలో శివుడు కనపడకపోవడంతో ఏం చేయాలో తెలీక పాండవులు ఎన్నో చోట్ల తిరిగారు కానీ శివుడి దర్శనం కాదు. అలా చివరిగా ఉత్తరాఖండ్లో శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడుని పాండవులు చూడడంతో శివుడు అక్కడ ఉన్న నందిలోకి కలిసి పోతాడు. కానీ తర్వాత భీముడు శివుడిని గుర్తుపడతాడు. అప్పుడు ఆ నంది భూమి లోకి వెలుతు ఉండంగా భీముడు ఆ నంది వీపు బాగానే పట్టుకుంటాడు. అప్పుడు ఆ భాగం శివలింగం ల ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోయింది. ఆ భాగం పిరమిడ్ షేప్ లో ఉన్న శివలింగంలా ఉంటుంది. కేదార్నాథో అదే శివలింగానికి పూజలు జరుగుతూ ఉంటాయి.పాండవులు అక్కడ పూజలు చేయడం ప్రారంభిస్తారు. పాండవుల భక్తి చూసి శివుడు ప్రత్యక్షమై వారు చేసిన తప్పులను క్షమించి స్వర్గానికి తీసుకెళ్తాడు. తరువాత పాండవులు ఆ లింగం ఉన్నచోట ఒక గుడిని నిర్మించారు. ఇప్పుడు ఆ మందిరాన్ని కేదార్నాథ్ అని అంటాము. ఈ ఆలయానికి దర్శించుకోడానికి ఇప్పుడు కూడా కొన్ని వేల మంది సంఖ్యలో వస్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ ఆలయంలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ఆలయాని ఆరు నెలలు తెరుస్తారు. ఆరు నెలలు ముస్తారు. అలా ఆరు నెలలు మూసే ముందు లయం ద్వీపం ఆరు నెలలు ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుందంట. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు? ఈ ఆలయాన్ని ఎందుకు ఆరు నెలలు మూసి వేస్తున్నారు అని? ఇప్పుడు ఇందాక ముందుగా మాట్లాడుకున్న విదంగా అక్కడ ఎక్కువగా మంచు కురవడం వలన అక్కడికి వచ్చే టూరిస్ట్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఉత్తర్ఖండ్ గవర్నమెంట్ నవంబర్ ప్రారంభం నుండి మే వరకు ఆలా ఆరు నెలలు కేదార్నాథ్ టెంపుల్ ని ముసివేసే నియమాన్ని తెచ్చారు.
ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఒక్క లైక్ కొట్టి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.