ఆరోజు వదిలేయకపోతే మహాభారతం మరోలా ఉండేది. ఐ మీన్ కర్ణుడు పాండవుల వైపు పోరాడి ఉంటే మహాభారతం మరోలా ఉండేది. కర్ణుడు అంటే మనకు గుర్తుకు వచ్చే పదం దానవీరశూరకర్ణ. ఈ పేరు రావడానికి కారణం,ఎవరు ఏమి అడిగినా ఒక్కక్షణం ఆలోచించకుండా దానం చేయగల ఏకైక వీరుడు కర్ణుడు. తాను అనుకుంటే కురుక్షేత్ర యుద్ధం గెలవగలడు. కానీ తన బలహీనత, ఏం అడిగినా దానం చేయగలడు కాబట్టి. తన కవచకుండలాలు దానం చేయడం వలన తన బలం తగ్గిపోతుంది. కవచకుండలాలు దానం చేయడం వలన తాను చనిపోయి యుద్ధంలో ఓడిపోతాడని తెలిసినా కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా తన కవచకుండలాలు దానం చేస్తాడు.
ఇలాంటి వీరుడు గురించి పుట్టుక నుంచి చావు వరకు మరియు కర్ణుడి గొప్పతనం. తన వీరత్వం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలో కనుక నాకు నచ్చితే ఇప్పుడే ఒక లైక్ కొట్టండి. ఇక లెట్ చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో.
ముందుగా కర్ణుడు ఎలా జన్మించాడు తెలుసుకుందాం!..ఒకానొక కాలంలో దుర్వాస మహర్షి కి కుంతీదేవి చాలా భక్తితో సేవ చేస్తుఉంటుంది. ఆ సేవకు మెచ్చిన దుర్వాస మహర్షి కుంతీదేవికి ఒక అద్భుతమైన మంత్రం చెప్తాడు. ఆ మంత్రం తనకి ఏ దేవుడు రూపంలో నైనా తనకి కొడుకు ప్రసాదిస్తాడు అని చెబుతాడు. దాంతో కుంతీదేవి ఈ మంత్రాన్ని పరీక్షించడానికి సూర్య దేవుడికి ఈ మంత్రం జపిస్తుంది. దానితో సూర్యదేవుడు ప్రతిష్టమై ఒక బాలుడిని కుంతిదేవి కి ప్రసాదిస్తాడు . అది ఎవరో కాదు దానవీరశూరకర్ణ. కర్ణుడు పుట్టిన వెంటనే కావాచకుండలతో చాలా తేజస్సు తో పుడతాడు.కుంచీదేవికి ఇంకా అప్పటికి పాండురాజుతో పెళ్లి కాలేదు. దానితో కుంతీదేవి చాలా భయపడి ఆ పిల్లవాడిని ఒక పెట్టిలో పెట్టి నదిలోకి విడుస్తుంది. ఆ నది నుంచి కొట్టుకొని వచ్చి రథసారథి అయినటువంటి అదిరాత నందన అనబడే వ్యక్తికి ఆ పెట్టి కనబడుతుంది. ఆ బిడ్డను వెళ్లి తన భార్యకు చూపిస్తాడు. పుట్టడంతోనే బంగారంతో పుట్టాడు కాబట్టి అతనికి వశసేనుడు అని పేరు పెట్టారు. కర్ణుడు రాజవంసుడు అయినా కూడా ఒక సాధారణ కులంలో పెరిగాడు.
అందువల్ల కర్ణుడుని నీది ఏ కులం అని అందరూ అవమానించే వాళ్ళు అలా ఒక రోజు కర్ణుడుని అవమానిస్తూ ఉన్నప్పుడు దుర్యోదనుడు అక్కడికి వచ్చి కర్ణుడితో స్నేహం ఏర్పడుతుంది ?కర్ణుడు దుర్యోధనుడుకి ఇచ్చిన ఒక్క మాట వలన ఆధర్మం అని తెలిసికూడా కౌరవులవైపు యుద్ధం చేస్తాడు. కర్ణుడికి బాల్యంలో తోడు ఎవరూ లేనప్పుడు ద్రోణాచార్యుడి దగ్గరికి యుద్ధం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు తను సుతుడు కావడంతో తను రథాన్ని నడపాలని అందరూ ఆవామనిస్తారు. దాంతో కర్ణుడికి చాలా కోపం వస్తుంది. అప్పుడు దూరం నుంచి చూస్తున్నా దుర్యోధనుడు తనకున్న ఒక రాజ్యానికి కర్ణుడిని రాజు చేస్తాడు.అప్పటినుండి వాళ్ళిద్దరూ స్నేహం అలానే కొనసాగుతుంది. కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు వచ్చి కర్ణుడితో ఇలా అంటాడు…నువ్వు పాండవుల వైపు నుంచి యుద్ధం చెయ్ అని అంటాడు.అప్పుడు కర్ణుడు వాళ్లు చిన్నప్పుడు నన్ను అవమానించారు. అప్పుడు నాకు తోడు దుర్యోధనుడు మాత్రమే ఉన్నాడు. నేను కౌరవులు వైపు నుంచి యుద్ధం చేస్తాను అని కృష్ణుడితో అంటాడు….తను యుద్ధం ఓడిపోతానాని తెలిసినా కూడా దుర్యోధనుడు వైపే నిలబడతాడు.కర్ణుడికి ఆ కవచకుండలాలు ఉన్నంతవరకు తనని ఎవరు చంపలేరు. కర్ణుడు ఆ కావచకుండలాలని దానం చేయకపోయి ఉంటే కర్ణుడు కచ్చితంగా యుద్ధంలో గెలిచేవాడు.
కర్ణుడు ఎంత గొప్పవాడు ఈ కథల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం….కర్ణుడు సామాన్యుడు కాదు కర్ణుడు ఎంత గొప్పవాడు అంటే ఒకరోజు అర్జునుడు, కర్ణుడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు కృష్ణుడు అర్జునుడు కి వేలు చూపి ఇలా అన్నాడు. కర్ణుడు నీతో సమానుడు లేదంటే నీ కంటే గొప్పవాడే కానీ కర్ణుడు నీకంటే తక్కువ వాడు అయితే కాదు అని శ్రీకృష్ణుడు అలా అర్జునుడితో అన్నాడు. ఒకరోజు కర్ణుడికి కలలోకి కర్ణుడి తండ్రి అయినటువంటి సూర్యదేవుడు కలలోకి వచ్చి ఇలా అంటాడు. ఇంద్రుడు బ్రాహ్మనుడి రూపంలో వచ్చి నీ కవచకుండాలలు అడుగుతాడు కానీ నువ్వు ఇవ్వద్దు అని ఒకవేళ ఇస్తే యుద్ధంలో నువ్వు ఓడిపోతావ్ అని చెబుతాడు. తన తండ్రి చెప్పినట్లే ఇంద్రుడు ఒక బ్రాహ్మనుడి రూపంలో వచ్చి కవచకుండలాలను కర్ణుడిని దానంగా చేయమని అడుగుతాడు. దానితో కర్ణుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా. తన చర్మం నుంచిరక్తం వస్తున్నా కూడా లెక్కచేయకుండా కత్తితో కోసి ఆ కావచ్చా కుండలను ను తీసి ఇంద్రుడి చేతిలో పెడతాడు. అలా దానం చేస్తూ ఉంటే ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. దానితో కర్ణుడు దానగుణం చూసిన ఇంద్రుడు తన గాయాలన్నీ బాగు చేసి వెళ్ళిపోతాడు. ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చాడని తన కవచకుండలాలు దానం చేస్తే యుద్ధంలో చనిపోతాడని తెలిసి కూడా ఆలోచించకుండా దానం చేస్తాడు . అందుకే అతడికి దానవీరశూరకర్ణ అనే పేరు వచ్చింది. అంతేకాదు చివరికి కర్ణుడు చనిపోయే ముందు కూడా దానం చేశాడు. అదేమిటి అంటే పాండవులకి విజయాన్ని చేకూర్చాలంటే కర్ణుడు చనిపోవాలి. అందుకు శ్రీకృష్ణుడు బిచ్చగాడి రూపంలో వెళ్లి కర్ణుడితో నీ పుణ్యం మొత్తం దానం చేయి అని అడుగుతాడు. దాంతో కర్ణుడు తన చేతికి ఉన్న రక్తాన్ని కృష్ణుడు చేతులకు అంటిస్తాడు. అప్పుడు కర్ణుడు మరణిస్తాడు. పుణ్యం లేకపోవడంతో కర్ణుడికి మోక్షం దక్కదు. అందుకే కర్ణుడు నరకానికి వెళతాడు.
ఇక్కడ కర్ణుడు చనిపోవడానికి కారణం మూడు శాపలు ఉన్నాయి అవి ఏంటి అంటే? మొదటి శాపం:-ఒకరోజు కర్ణుడి గురువు అయినటువంటి పరుశురాముడు,కర్ణుడి తొడ భాగంపై పడుకుంటాడు. ఇంద్రుడు ఒక పురుగు రూపంలో వచ్చి తొడ భాగంలో కొరకడం ప్రారంభిస్తాడు. దాంతో రక్తం అంతా పోయి పరుశురాముడు చేతికి అంటుకుంటుంది.దాంతో నిద్రలేచిన పరశురాముడు బ్రాహ్మణులకు అయితే ఇంత ఓపిక ఉండదు నువ్వు ఖచ్చితంగా క్షత్రియుడు అని కర్ణుడితో అంటాడు. అప్పుడు పరశురాముడు కర్ణుడికి ఒక శాపం ఇస్తాడు అది ఏమిటంటే నీకు అస్త్రాలు,శాస్త్రాలు అత్యంత అవసరం ఉన్నప్పుడు వాటిని ఎలా ప్రయోగించాలో నువ్వు మర్చిపోతావ్ అని పరుశురాముడు శపిస్తాడు. పరశురాముడు అలా శపించిన తర్వాత కర్ణుడు తన బాధలను చెప్పుకుంటాడు ఆ బాధలను విని పరుశురాముడు కూడా బాధపడతాడు.
రెండవ శాపం:-కర్ణుడు తన రథాన్ని వేసుకొని వెళుతుండగా ఇంద్రుడు పులి వేషం ధరించి ఆవుని తినడానికి వెళతాడు. దాంతో ఆవుని తినడానికి వెళుతుందేమో అని కర్ణుడు బాణం ప్రయోగిస్తాడు. ఆ పులి మాయమై ఆ బాణం ఆవుకి తగులుతుంది. వెంటనే సాధువు బయటకు వచ్చి నేను ఈ ఆవు వలనే బతుకుతున్నాను. అలాంటి ఆవును నువ్వు ఎలా చంపుతావు . నువ్వు చూస్తుంటే . వీరుడు ల ఉన్నావ్. నువ్వు నా ఆవును ఏం సహాయం లేనప్పుడు చంపావు కాబట్టి నీ చేతిలో యుద్ధం చేయడానికి ఆయుధాలు లేనప్పుడు నువ్వు మరణిస్తావు అని శపిస్తాడు.
మూడవ శాపం:-ఒకరోజు కర్ణుడు తన రథాన్ని వేసుకుని వెళుతుండగా ఒక చిన్న పాప అడ్డం వస్తుంది.దానితో కర్ణుడు రథని ఆపుతాడు. ఆ చిన్న పాప భయపడి చేతిలో ఉన్న నెయ్యి గిన్నె కిందకి పడెస్తుంది..నెయ్యి కింద పడిన వెంటనే ఆ చిన్న పాప ఏడవటం మొదలు పెడుతుంది.కర్ణుడు దాంతో నేను నీకు నయ్యిని కొనిస్తాను ఏడవ వద్దు అని చెబుతాడు.చిన్నపిల్లల పట్టు బడితే ఆపట్టుని అసలు వదలరు అంటారు అలా ఆ చిన్న పాప నాకు అదే నైయ్యిఏ కావాలి అని ఏడుస్తుంది. దాంతో కర్ణుడు ఆ నెయ్యి పడిన ప్రదేశం నుంచి మట్టిని తీసుకుని గట్టిగా పిండుతాడు. అప్పుడు నెయ్యి ఆ గిన్నెలోకి పడుతుంది. దాంతో భూమాత కర్ణుడిని ఇలా శపిస్తుంది. నువ్వు యుద్ధంలో ఉండగా నీ రథచక్రం భూమిలో ఇరుక్కుకుంటుంది.దాంతో నువ్వు చనిపోతావు అని భూమాత కర్ణుడిని శపిస్తోంది.
ఈ మూడు శాపాల కారణంగా….. పరశురాముడు పెట్టిన మొదటి శాపం వల్ల యుద్ధం రంగంలో ఉన్నప్పుడు అర్జునుడిని చంపుదాం అనుకున్నప్పుడు తనకు ఆ షాస్త్రాలు ఎలా ప్రయోగించాలో గుర్తు రావు. భూదేవి పెట్టిన రెండవ శాపం వల్ల కర్ణుడి యొక్క అ రధ చక్రం భూమిలో ఇరుక్కుంటుంది. దానిని బయటకు తీద్దాం అని కర్ణుడు తన ఆయుధాన్ని వదిలేసి రథం దిగి చక్రం పైకి లేపుతూ ఉండగా.కృష్ణుడి ఆదేశించడంతో అర్జునుడు కర్ణుడు పై బాణం ప్రయోగించి కర్ణుడిని చంపుతాడు….ఇక్కడ కర్ణుడు చావుకు ముందు ఏం చెప్పాడాంటే? కర్ణుడు దానగుణాలు ధైర్యం అన్ని చూసి కృష్ణుడు బాధపడుతూ నీకేం వరం కావాలో కోరుకో అని చెబుతాడు. దానికి కర్ణుడు సమాధానంగా నేను నిన్ను అడగొచ్చు దుర్యోధనుడి సైన్యం మొత్తం బతికించి దుర్యోధనుడికి గెలుపు ప్రసాదించు అని! కానీ నాకు అది ఇష్టం లేదు. నేను చనిపోయిన తర్వాత ఈ వార్త నా తల్లికి చెప్పు అని కర్ణుడు అంటాడు. అలా కర్ణుడు ఈ మూడు శాపాలు కారణంగా చనిపోతాడు. చనిపోయిన కర్ణుడిని చూసి శ్రీకృష్ణుడు ఏడుస్తాడు….ఎందుకంటే కర్ణుడు ఒక గొప్ప వీరుడు ఇంకా చెప్పాలంటే చాలా మంచివాడు. తను దర్మం వైపు కాకుండా ఆధర్మం వైపు నిలుచున్నాడు అందుకే కర్ణుడు చనిపోయాడు. ఆయన తన పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది అదే దానవీరశూరకర్ణ….
కర్ణుడి కవచకుండలాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి?
కర్ణుడి కవచకుండలాలో ఇప్పటికైనా భూమి మీదే ఉన్నాయి. ఇంద్రుడు కర్ణుడు కవచకుండలాలను దక్కించుకున్నాడు కానీ వాటిని స్వర్గం లోపలికి తీసుకు వెళ్ళలేకపోయాడు.అప్పుడు ఇంద్రుడు వాటిని ఈ భూమి మీద దాచి పెడదామని ఒక ప్రదేశం వెతుక్కుంటూ వెళతాడు. అప్పుడు చంద్రుడు ఆ కవచకుండాలను దొంగలించుకుని వెళతాడు. అప్పుడు సముద్రుడు తనను ఆపి ఆ కవచకుండలాలు తీసుకుంటాడు. ఆ కాచకుండలాలని కర్ణుడికి ఇచ్చింది సూర్యుడే కాబట్టి అప్పటినుండి సముద్రుడు ఇంకా సూర్యుడు కాపలా కాస్తూ ఉన్నారు. ఇప్పుడు అవి ఒడిస్సా లో ఉన్న కోణార్ ఆలయం కింద ఈ కావచకుండలాలో భద్రపరిచి ఉన్నాయి అని కొంతమంది నమ్ముతున్నారు….
ద్రౌపతి కర్ణుడిని ప్రేమిస్తుందా? ద్రౌపది స్వయంవరం జరుగుతుండగా కర్ణుడు అక్కడికి వెళతాడు. కానీ కులం పేరుతో కర్ణుడుని వారందరూ ఆవామనిస్తారు. దాంతో కర్ణుడు అక్కడి నుంచి వెళ్తాడు. ద్రౌపది తాను కర్ణుడిని తన ఐదు మంది భర్త కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని కులం కారణంగా అతనిని పెళ్లి చేసుకోలేదని పురాణాలు చెబుతున్నాయి.
కర్ణుడు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ముగింపు అయినా కూడా కర్ణుడు చనిపోలేక పోతాడు. అప్పుడు పాండవులకి విజయాన్ని చేకూర్చాలంటే కర్ణుడు చనిపోవాలి. అందుకు శ్రీకృష్ణుడు బిచ్చగాడి రూపంలో వెళ్లి కర్ణుడితో నీ పుణ్యం మొత్తం దానం చేయి అని అడుగుతాడు. దాంతో కర్ణుడు తన చేతికి ఉన్న రక్తాన్ని కృష్ణుడు చేతులకు అంటిస్తాడు. అప్పుడు కర్ణుడు మరణిస్తాడు. పుణ్యం లేకపోవడంతో కర్ణుడికి మోక్షం దక్కదు. అందుకే కర్ణుడు నరకానికి వెళతాడు.
కర్ణుడు వచ్చే జన్మలో ఏమై పుడతాడు? కర్ణుడికి ఈ రెండు కోరికలు ఇస్తాడు.కృష్ణుడికి ఒక చిన్న భక్తుడిగా పునర్జన్మ పొందుతాడని ఇంకా తన సొంత కుమారుడిని శివుడికి బలి ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. దీనివలన కర్ణుడికి మోక్షం చేకురుకుంటుంది. ఇలా కర్ణుడి జన్మ ధన్యం అవుతుంది. పురాణాలు చెబుతున్నాయి….ఇలా లెక్క చేయకుండా ఎవరు ఏమి అడిగినా ఒక్క క్షణం ఆలోచించకుండా దానం చేయగల ఏకైక వీరుడు మన దానవీరశూరకర్ణ కర్ణుడు…
చూశారు కదా ఫ్రెండ్స్ కర్ణుడు ఎంత గొప్పవాడో. ఈ వీడియోలో కనుక నా ఎక్స్ప్లనేషన్ కనుక నచ్చితే లైక్ కొట్టి. ఇంకా ఇలాంటి ఇన్ ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్ థిస్ ఇస్ నవీన్ కుమార్ సినింగ్ ఆఫ్.