Top 5 Unkown Facts In Telugu

Facts Free Stock Photos, Images, and Pictures of Facts

#1 ఏదైనా ఖాళీ సమయంలో ఇంట్లో ఉంటే మగవాళ్ళు లుంగీలు ధరించి ఫ్రీగా తిరుగుతుంటారు అదే ఆడవాళ్ళు అయితే నైటీలు తమకు సౌకర్యంగా ఉంటాయని వేసుకుంటూ ఉంటారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ఉన్న తోకలపల్లి అనే గ్రామంలో ఉదయం 7గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఆడవాళ్లు నైటీలు ధరించకూడదని నిషేధం వేయించారు. ఈ సమయంలో ఆడవాళ్లు నైటీలు వేసుకోవడం మంచిది కాదని ఎవరైనా పట్టించుకోకుండా ధరిస్తే వాళ్లకి ₹2,000 జరిమానా విధిస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్ లోని నోయిడా లో ఉన్న ఒక హౌసింగ్ కాలనీలో ఆడవాళ్లు నైటీలు మరియు మగవాళ్ళు లుంగీలు ధరిస్తే వారికి అసౌకర్యంగా ఉంటుందని ఇక్కడ వీటిని బ్యాన్ చేశారు.

#2 ఇండియా స్థాయిలో ఒక బెస్ట్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యాడు. అది కూడా అవ్వకూడని విధంగా అయ్యాడు. తన దగ్గర పనిచేసిన లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అయినా సృష్టి శర్మ అనే మధ్యప్రదేశ్ కు చెందిన ఒక 21 సంవత్సరాల అమ్మాయిని తన లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. దాని తర్వాత రాయదుర్గం ఆ పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్కు ఈ కేసును బదిలీ చేశారు. ఈ విషయం తెలియగానే రెండు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. 2017లో డి ఆడిషన్స్ కు వచ్చిన ఈ సృష్టిశర్మ 2019 నుంచి జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తూ వచ్చింది. అయితే ముంబై హైదరాబాద్ చెన్నై వంటి వేరే ప్రాంతంలో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు తనపై లైంగికంగా దాడి చేశాడని ఆ అమ్మాయి తెలియజేసింది. ఈ విషయం జానీ మాస్టర్ భార్యకు కూడా తెలుసు అని ఆ అమ్మాయి ప్రెస్ ముందు చెప్పింది. ఈ విషయం తెలియగానే దాని మాస్టర్ తన ఇంటి నుంచి మాయమైపోయి నెల్లూరులో ఉన్న తన సొంత ఊరికి వెళ్లాడని పోలీసులు చెప్పారు .తరవాత జానీ మాస్టర్ గోవా లో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ భార్య ఆయేషా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి అక్కడ నానా రచ్చ చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ ని పోలీసులు రిమాండులో తీసుకున్నప్పుడు ఆమెను నిజంగా వేధించినట్లు ఒప్పుకున్నాడట అని తెలుస్తుంది. ఈ కేసు గురించి ఇంకా చాలా విషయాలు తెలియలిసి ఉంది.

#3 ఏ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి హార్ట్ ఎటాక్ ఎక్కువగా వస్తుంది? ఈ కాలంలో హార్ట్ ఎటాక్ అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. పెద్దవారి నుంచి చిన్న పిల్లలకు అందరికీ హార్ట్ ఎటాక్ రావడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఏం బ్లడ్ గ్రూప్ ఉన్న వారికి హార్ట్ ఎటాక్  వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందో తెలుసుకుందాం. మనకు తెలిసినంతవరకు బ్లడ్ గ్రూపులో 8రకాలు. మిగతా బ్లడ్ గ్రూప్లో తో పోలిస్తే ఓ ఇలాంటి గ్రూప్ ఉన్నవారికి హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్ లు చాలా తక్కువ.A, B మరియుAB బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి కొరోనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు చాలా ” ఎక్కువగా ఉంటాయి.

#4 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజక్షన్ జైపూర్ కు చెందిన జీకే లోన్ హాస్పిటల్ లో వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న ఒక చిన్న పిల్లవాడికి 17.5 కోట్ల రూపాయల విలువైన ఇంజక్షన్ ను వేశారు. హాస్పటల్లోని డాక్టర్ మాతూర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లడాయిన అర్జున్ కి జోల్గానేస్మా అని ఇంజక్షన్ వేసాము అని చెప్పారు. ఇంజక్షన్ కు ఖర్చయిన డబ్బును క్రౌడ్ ఫండింగ్ ద్వారా కనెక్ట్ చేశారు. దీని గురించి తెలిసిన ఇంజక్షన్ ను తయారు చేసే ఫార్మాసిటికల్స్ కంపెనీ ఆ ఇంజక్షన్ ధరను సగానికి తగ్గించింది.

#5 ఆరవ తరగతి ఫెయిల్ అయిన యువకుడు 2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేతగా మారాడు. ఇది బెంగళూరులోని  ID fresh కంపెనీ CEO PC ముస్తఫా యొక్క కథ. కేరళలోని వయనాడ్ లో ఉన్న చిన్న గ్రామంలో ముస్తఫా జన్మించాడు. తనకు పది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆరవ తరగతి ఫెయిల్ అవ్వడంతో చదవడం విడిచిపెట్టాడు. ఆ తర్వాత స్కూల్ టీచర్ తనకు నచ్చజెప్పి చదివించడంతో చదువుకొని MBAవరకు పూర్తి చేశాడు. ఆ తర్వాత 2005లో బెంగళూరులో దోస మరియు ఇడ్లీ పిండి వంటి రెడీ టు కుక్ వస్తువుల సామర్త్యాన్ని  గుర్తించి ఒక ప్రయత్నం అమలు చేశాడు. మొదట 50వేల ఖర్చుతో తిప్ప సంద్రలో ఒక ప్లాంట్ ను ఏర్పాటు చేశాడు. ఇది ఇంత చిన్న ప్రదేశంలో ఉంటే సక్సెస్ కాదు అని తెలుసుకున్న అతను కేరళలో తనకు ఉన్న భూమిని అమ్మి 550 చదరపు అడుగులతో ఒక పెద్ద ప్లాంట్ ను  స్థాపించి ఉత్పత్తిని పెంచాడు. 2015 16 సంవత్సరంలో అతని ఆదాయం 100 కోట్లుగా ఉంటే అది ఇప్పుడు 2000 కోట్లకు పైగా అభివృద్ధి చెందింది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top