Kalki Part 2 Movie Imagination Story In Telugu

Kalki : Part 2 - Trailer | Prabhas | Amitabh Bachchan | Kamal Haasan ...KALKI PART 2
మీరు ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. కలియుగం వస్తుంది కలి వస్తున్నాడు. అధర్మం అంత పెరిగిపోయి ప్రపంచం అంత చీకటి అయిపోయినప్పుడు నేను మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తాలి. ఆ యుగంలో కలి ఎంత శక్తివంతుడు అంటే నా పుట్టుకను సైతం ఆపగలడు.దీనికి అర్థం ఏంటి అంటే కలియుగం లో చాలా దారుణాలు, ఆగహిత్యలు, రాజకీయ్యాలు చేస్తూ ఉంటారు. అమ్మాయిలను కామం తో చూడటం ఇంకా వారి మీద ఆగహిత్యం చేయటం సులువు  అయిపోతుంది. మనుషులు చాలా దారుణలకు దిగజారుతారు. డబ్బుతోనే ఏ పని అయినా కూడా అవుతుంది. డబ్బుతోనే చట్టాలను కోనేస్తారు. మనుషులను స్వార్థనికి వాడుకొని న్యాయం ధర్మం అంత మర్చిపోయి ఎవరికీ భయపడకుండా ఉంటారు.ఇలాంటి సమయం లోనే కలి జన్మిస్తాడు.ఈ మాటలన్నీ అన్న తర్వాత శ్రీకృష్ణుడు అశ్వద్ధామ కు ఒక శాపం పెడతాడు. అది ఏంటంటే కలియుగం అంతమయ్యేంత వరకు నీ మనీ నా దగ్గరే ఉంటుంది. కలియుగం అంతమయ్యేంత వరకు నువ్వు ప్రాణాలతోనే ఉంటావు. ఎప్పుడైతే నీ మని దగ్గరికి చేరుతుందోనీ గాయాలన్నీ మానిపోతాయి. అదే సమయంలో నేను మరొక్క అవతారం ఎత్తుతాను అని శ్రీ కృష్ణుడు అశ్వాద్దామా తో అంటాడు. ఇంకా ఈ కథ లోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండ లైక్ చేయండి ఈ వీడియో కి నేను ఇచ్చే టార్గెట్ 100 k లైక్స్. ఇలా ప్రతిఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే ” super story ” అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం.K1

మీరు కల్కి క్లైమాక్స్ లోకి వస్తే అక్కడ భైరవ సుమతి ని తీసుకొని  తన బుజ్జి కార్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉంటాడు. అదే టైం లో అశ్వద్ధామ సోదరా ఆగు అంటూ భైరవతో అంటాడు. కానీ అశ్వద్ధామ మాటలు భైరవ పట్టించుకోడు. ఇంకా అతడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని బుజ్జి కార్ లో ఉన్న ఒక బటన్ ని నొక్కుతాడు.ఆ సమయం లో అశ్వద్ధామ పక్కన ఉన్న ఒక చిన్న పిల్లవాడు ఇలా అంటాడు,అసలు అతను ఎవరు అని అడుగుతాడు. దానికి అశ్వద్ధామ సమాధానం గా తను నా సోదరుడు కర్ణుడు అని అంటాడు. అప్పుడు ఆ చిన్నపిల్లవాడు అతను అంత పవర్ ఫుల్ఆ అని అశ్వద్ధామ ను అడుగుతాడు. అప్పుడు అశ్వద్ధామ,  కర్ణుడు చాలా గొప్ప వీరుడు  అతను ఒకవేళ పాండవుల పక్క నుంచి పోరాడి ఉంటే మహాభారత యుద్ధము ఇంకోలా ఉండేది. అతని చేతిలోఉన్నా విజయదనస్సు ఎంత గొప్పది అంటే అది అర్జునుడి గాండీవం కంటే చాలా గొప్పది. ఆ విజయ ధనస్సు కర్ణుడు చేతిలో ఉన్నంత వరకు ఎవరు  కర్ణుడిని చంపలేరు. కానీ కర్ణుడు 3 శాపాల వలన చనిపోయాడు అని అశ్వద్ధామ ఆ పిల్లవాడితో అంటాడు.తర్వాత అక్కడి నుంచి విజయ ధనస్సు తిసుకొని అశ్వాద్దామా బయలు దేరుతాడు.ఆ విజయం దణ్ణసు కర్ణుడి దగ్గరకు తీసుకొని వెళ్తాడు . కార్లో ఉన్న ఆ బటన్ నొక్కిన వెంటనే  భైరవ మహాభారతం యుద్ధం జరిగిన ప్రదేశంలో  పడతాడు.  అక్కడ పడిన వెంటనే బుజ్జి కార్ పేలిపోతుంది. సుమతి ఒకవైపు ఇంకా భైరవ ఒక వైపు వెళ్లి పడతారు. అక్కడ చుట్టు మొత్తం ఇసుక ఉంటుంది. భైరవ ఎంతసేపు నడిచినప్పటికీ దారి దూరం పెరుగుతూనే ఉంటుంది. కానీ ఆ దారికి అంతం రాదు. భైరవ నడుస్తూ ఉండే సమయంలో ఒక బంగారుతో నిర్మించిన ఒక కోట సూర్యుడి తేజస్సు తో మెరుస్తూ కనబడుతుంది. ఆ కోట దగ్గరకు వెళ్ళిన వెంటనే అక్కడ ఒక హస్తంతో మూసివేసిన ఒక ద్వారం కనబడుతుంది. అక్కడ భైరవ తన హస్తాన్ని పెడతాడు. హస్తాన్ని పెట్టిన వెంటనే ఆ ద్వారం తెరుచుకుంటుంది. లోపలచాలా మెరుస్తూ ఒక పరికరం కనిపిస్తుంది. అది ఏంటి అని భైరవ దగ్గరికి వెళ్లి దాన్ని తాకుతాడు. వెంటనే భైరవ శరీరానికి కర్ణుడు కవచకుండలాలు అతుక్కుంటాయి. భైరవకి అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఇంకొక సైడ్ కాంప్లెక్స్ వదిలి సుప్రీమ్ యాస్కిన్ అర్జునుడి గందీవం తీసుకొని  బయలు దేరుతాడు.కొంచం బయటకు వచ్చిన వెంటనే అక్కడ సుమతి ఇంకా భైరవ కనబడతాడు.K2

ఆ కావచకుండలాలు ఉన్నపుడు భైరవ కర్ణుడిలా మారుతాడు.అక్కడ కర్ణుడు సుప్రీమ్ మనుషులను చాలా దారుణంగా చంపుతు ఉంటాడు. అక్కడ కర్ణుడు కొన్ని వేల మంది సైన్యని నాశనం చేస్తాడు.కానీ కర్ణుడికి అది కేవలం యుద్ధనికి ముందు చేసే ఆయుధ పూజ ల అనిపిస్తుంది.అప్పుడు అక్కడికి అశ్వాద్దామా వస్తాడు వెంటనే అశ్వాద్దామా కర్ణుడికి విజయ ధనస్సును ఇస్తాడు అప్పుడు కర్ణుడు ఇంకా అశ్వాద్దామా చాలా ఘోరమైన యుద్ధని సుప్రీమ్ తో చేస్తూ ఉంటారు. సుప్రీమ్ కూడా చాలా బలంగా వారితో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేస్తూ ఉన్నపుడు మెల్లగా సుప్రీమ్ సైన్యం తక్కువ ఐతు వస్తుంది. తరువాత వాళ్ళ బలం అర్థం చేసుకున్న సుప్రీమ్ అక్కడి నుండీ వెళ్ళిపోతాడు. అక్కడి నుండీ సుప్రీమ్ వెళ్లి 11 కాంప్లెక్స్ లకు హెడ్ అయిన కలి దగ్గరకు వెళ్తాడు.కలి ఎంత శక్తివంతుడు అంటే కలి అనుకుంటే భూమి మొత్తాన్ని అంతం చేయగలడు ఇంకా కల్కి జన్మ ను కూడా ఆపగలడు. సుప్రీమ్ వెళ్లి అక్కడ ఎం జరిగిందో మొత్తం కలి తో చెప్తాడు.అలాగే అర్జునుడి గండివం గురుంచి కూడా చెప్తాడు. సుప్రీమ్ దగ్గర నుండీ కలి అర్జునుడి గందీవన్నీ తీసుకుంటాడు.అప్పుడు కలి కి ఆ గండీవం వలన చాలా పవర్స్ వస్తాయి.ఆ 11 కొంప్లెక్స్ లకు హెడ్ అయినా వారందిరిని పిలిపించి నాకు 1కోటి మంది అమ్మాయిల సిరమ్ కావాలి,ఇంకా కొన్ని రోజులలో చాలా ఘోరమైన యుద్ధం జరగబోతుంది మీరు మీ సైన్యలను సిద్ధం చేసుకోండి అని కలి వారితో అంటాడు. ఆ కొంప్లెక్స్ లో ఉన్న వాళ్ల్లు అంత దేవుడు లేడు, నిజంగా దేవుడు ఉంనింటే ఈ సమయం లోపల వచ్చి ఉండేవాడు కానీ రాలేదు అని ప్రజలందరూ చాలా భాదతో ఏడుస్తూ ఉంటరు.K3

ఇంకొక వైపు కర్ణుడు ఇంకా అశ్వాద్దామ సుమతిని కర్ణుడికి కావచకుండలాలు దొరికిన ఆ బంగారు గృహం లోకి తీసుకొని వెళ్తారు.అప్పుడు ఆకాశవాని అదే నిజమైన షాంబల అని వారితో అంటుంది. అప్పుడు ఆమె ను లోపలికి తీసుకోని  వెళ్తారు. శంభాల లో ఉండే ప్రజలు అందరూ కొన్ని కోటి కళ్ళతో కల్కి కోసం ఎదురు చూస్తూ ఉంటారు.వాళ్ళు సుమతిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు అక్కడ కర్ణుడు ఇంకా అశ్వాద్దామా ఆమెకు కాపలాగా ఉంటారు.ఆమె ను చాలా పవిత్రంగా చూసుకుంటూ  ఉంటారు. ఇంకా ఆమె కు కావాల్సిన పదార్థాలు అన్ని షాంబల లో ఉండే వారు చూసుకుంటూ ఉంటారు. ఆమెకు 3 నెలల తరువాత పురిటి నొప్పులు మొదలవుతాయి . ఇంకా చుట్టూ పక్కల ఉన్నవాళ్లు అందరు అక్కడికి వస్తారు.ఇంకా కొన్ని రోజుల పాటు వారు అందరు అక్కడే వేచి ఉంటారు.
కొన్ని రోజుల పాటు వేచి చుసిన తరువాత ఆ రోజు రానే వచ్చింది  నక్షత్రాలు అన్ని ఒకటే దిశా లో ఉన్నాయి.6000 సంవత్సరాలు కు వచ్చే ఒక నక్షత్రం అప్పుడే కనిపించింది. సముద్రాలు ఉప్పొంగి పోతుంటాయి .మేఘాలు అన్ని ఉరుముతు జోరుగా వాన పడుతూ ఉంటుంది.అందరు కొన్నికోట్ల కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు.శ్రీ మహావిష్ణువు  దశ అవతారలలో చివరి అవతారం అయినట్టు వంటి కల్కి అవతారం జన్మిస్తాడు.అతడు పుట్టిన వెంటనే చేతిలో చక్రం తో చాలా తేజస్సు తో జన్మిస్తాడు.శ్రీ మహా విష్ణు పదోవ అవతారం అయినటువంటి కల్కిగా జన్మించాడు అని  హనుమంతుడికి తెలుస్తుంది.స్వామి ఏదో కార్యం మీద మళ్ళీ వచ్చాడు నేను మళ్ళీ నా స్వామిని దర్శించుకోవాలి అని అక్కడి నుండీ గాలి వేగంతో శ్రీ ఆంజనేయ స్వామి శంభాలకు  చేరుకుంటాడు. అక్కడ వెళ్లిన వెంటనే బాలుడు మెరుస్తూ చేతిలో చక్రం పట్టుకొని ఉంటాడు.అక్కడి వారు అందరూ సంతోషం గా ఉంటారు.కొంతసేపు అయినా తరువాత హనుమంతుడు వారందరిని హిమాలయాలకు తీసుకొని వెళ్తాడు. అక్కడ శ్రీ మహా విష్ణు రోజు రోజు కి పెరుగుతూ ఉంటాడు.తాను రోజు రోజుకు పెరుగుతూ ఉన్నపటికీ తన బాలలు ఏమిటో తనకు తెలియదు.కొన్ని రోజులకు కల్కి యుద్ధనికి సిద్ధాంతం గా ఉంటాడు.K4

కలి కూడా యాద్దానికి సిద్ధం అవుతూ ఉంటాడు. ఇంకా 11 కాంప్లెక్స్ లకు హెడ్స్ అందరు కలిసి 1 కోటి మంది సిరమ్ ను తయారు చేసుకొని కలి దగ్గరకు వెళ్తారు.ఆలా అందరి సిరమ్ కలిపి ఒక గొప్ప సిరమ్ ని కలి తయారు చేసి ఆ సిరమ్ ను తనలో ఇంజెక్ట్ చేసుకుంటాడు.దాంతో కలి చాలా భయంకరమైన రూపాన్ని దాలుస్తాడు.ఆలా కొన్ని కోట్ల మంది సైన్యం తో కలి అర్జునుడి గండీవం తీసుకొని అక్కడి నుండీ బయలు దేరుతాడు.కలి యొక్క  సైనికులు అందరూ భూమి మీద ఉన్న ప్రతి మూల కల్కి కోసం వెతుకుతూ ఉంటారు. కల్కి మరియు అదే సమయం లో హనుమంతుడు,అశ్వాద్దామా,పరశురాముడు ఇంకా సప్త చిరంజీవులు కల్కి సైన్యం తో కలిసి యుద్ధనికి బయలుదేరుతారు.కల్కి మహాభారతం యుద్ధం జరిగిన చోటుకి చేరుతాడు.అదే సమయం లో కలి ఇంకా తన సైన్యం అక్కడికి వస్తుంది దాంతో అక్కడ చాలా ఘోరమైన యొద్దం మొదలౌతుంది.హనుమంతుడు అక్కడ చాలా మందిని సంహారిస్తూ ఉంటాడు.అలాగే కర్ణుడు కూడా తన విజయ ధనుస్సు తో ఉచా కొత కోస్తూ ఉంటాడు.ఇలా కొంచం కొంచం గా కలి యొక్క సైన్యం అంతం అవుతూ ఉంటుంది.అప్పుడు కలి ఒక ఉపయాన్ని వేస్తాడు.కల్కి ని చంపితే మొత్తం యుద్ధం ఏ అయిపోతుందిగా అని కలి అనుకుంటాడు.అప్పుడు కలి కల్కి కి ఒక పంచ్ ఇస్తే కల్కి 1000 అడుగుల దూరం లో వెళ్లి పడతాడు.K5

అప్పుడు ఆకాశవని వచ్చి కల్కి బలల గురించి తనతో చెప్తుంది.అప్పుడు కల్కి చాలా ఘోరమైన యుద్ధన్ని చేస్తాడు కొన్ని కోట్ల మంది సైనికులని కల్కి చంపేస్తు ఉంటాడు.అప్పుడు హనుమంతుడు,అశ్వాద్దామా,కర్ణుడు వీళ్లందరు షాక్ అవుతారు. అక్కడ వారందరు ఇలా అనుకుంటారు స్వామి మన మీద దయతో మన సహాయం తీసుకుంటున్నాడు తప్పితే ఆయనకు ఎవరి సహాయం అక్కర్లేదు అని వారందరికీ అర్థం అవుతుంది.ఇలా కల్కి ఉచ కొత్త కోస్తూ ఉంటాడు.ఇలా చాలా సమయం తరువాత కల్కికి ఇంకా కలికి చాలా ఘోరమైన యుద్ధం జరుగుతుంది.ఆ యుద్ధం వారు ఇద్దరు చేస్తుంటే భూమి కూడా దద్దరిలి పోయింది.కల్కి తన విష్ణు చక్రం తీసుకొని గండీవం ను విరిచి వేస్తాడు.అలాగే కలి కూడా చాలా భయంకరమైన యుద్ధం చేస్తాడు.చివరికి కల్కి తన తెల్ల గుర్రం పై వచ్చి కలి తల గాల్లో ఎగిరి పడేలా నరుకుతాడు.అలాగే ఇంకా సుప్రీమ్ ను ఇంకా 10 మంది కలి మనుషులను చంపేస్తాడు.ఇలా కలి యొక్క జీవితం ముగుస్తుంది.చివరికి అధర్మం వైపు ఉన్న వారందరిని చంపి ధర్మం వైపు ఉన్న వారిని కలి యుగం ముగించి సత్య యుగానికి తీసుకొని వెళ్తాడు.
ఆ సత్య యుగం లో గంగ నాది, పర్యావరణం అంత మళ్ళీ యాదవిధిగా చేస్తాడు. ఇంకా అవతారం చలించే ముందు కల్కి  ఇలా అంటాడు. ఈ పది అవతరాలతో ఇంకా నేను పుట్టాను అని అస్సలు అనుకోకండి.ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ అధర్మనీ అనిచివేయదానికి మళ్ళీ మళ్ళీ పుడుతూనే వుంటాను అని అంటాడు.ఇలా చెప్పిన తరువాత ఒక పెద్ద శిలా గా మారిపోతాడు . అలా కలియుగం ముగిసిపోతుంది.K6

కల్కి పార్ట్ 2 మూవీలో స్టోరీ ఈ విధంగా ఉండవచ్చని మా అంచనా,కానీ ఈ స్టోరీ మేం చెప్పిన విధంగా ఉండవచ్చని గ్యారెంటీ లేదు  ఈ వీడియో మీకోసం కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ కోసం చేయడం జరిగింది. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి నేను చెప్పిన టార్గెట్ కి రీచ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top