how to make human postmertom explain in telugu

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. ఈరోజు ఈ వీడియోలో డెడ్ బాడీకి  ఎందుకు పోస్టుమార్టం చేస్తారు? అసలు పోస్టుమార్టం ఎలా చేస్తారో సింపుల్ గా మన లాంగ్వేజ్ లో ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో ని స్టార్ట్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో

How to become a Operation Theatre Technologist in India -Career ...

ముందుగా మనం పోస్టుమార్టం ఎందుకు చేస్తారో తెలుసుకోవాలి. పోస్టుమార్టం చేయడానికి ఒక మెయిన్ రీసన్ ఉంది అది ఏమిటి అంటే? ఇది మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఒక రూమ్ లో అనుమానస్పదంగా  చనిపోయి ఉన్నాడు అనుకోండి. అప్పుడు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో మనం తెలుసుకోలేము  So ఆ వ్యక్తి  ఆత్మహత్య చేసుకుని చనిపోయాడా? లేదా ఎవరైనా బలవంతంగా అతనిని హత్య చేసి చంపారా? అనే విషయం తెలియదు. సో దీని వలన హంతకులు చాలా సులభంగా తప్పించుకునే అవకాశం ఉంది. అందుకే అనుమానస్పదంగా చనిపోయి ఉంటే, వారు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవడం కోసమే పోస్టుమార్టం చేస్తారు. ఇలా చనిపోయిన వారి డెడ్ బాడీ మీద పోస్టుమార్టం చేసిన తర్వాత ఇది ఆత్మహత్య కాదు హత్య అని తెలిస్తే పోలీసులు ఆ కేసుని ఇంకా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇలా డెడ్ బాడీలకు పోస్టుమార్టం చేయడం ద్వారా ఎవరిపైనైనా అనుమానం ఉంటే హంతకులను పట్టుకునే ఛాన్స్ ఉంటుంది.ఇక లేట్ చేయకుండా పోస్టుమార్టం ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం!

డాక్టర్స్ పోస్టుమార్టం చేసేటప్పుడు చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు ఎందుకంటే డెడ్ బాడీస్ సరైన ఆకృతిలో ఉండకపోవచ్చు అది ఎలాగంటే చాలా పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు చనిపోయిన వ్యక్తి యొక్క ముక్కలు ముక్కలుగా అయినా బాడీస్ ఉంటాయి. అలాంటప్పుడు డాక్టర్లు డెడ్ బాడీని సరిగ్గా అనలైజ్ చేయలేరు. అయితే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి నార్మల్ డెడ్ బాడీకి ఎలా పోస్టుమార్టం చేస్తారో తెలుసుకుందాం! పోస్టుమార్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా చనిపోయాడో తెలుసుకోవడం సో పూర్తిగా డెడ్ బాడీని పోస్టుమార్టం చేసిన తర్వాత అతడి చావు నాచురల్ డెత్తా లేకపోతే ఎవరైనా హత్య చేశారా? లేకపోతే తనకు తానే ఆత్మహత్య చేసుకున్నారా? అనే విషయం ఈ పోస్టుమార్టం రిపోర్ట్స్ ద్వారా క్లారిటీ వచ్చేస్తుంది. పూర్తిగా డెడ్ బాడీని అనలైజ్ చేసినా కూడా రిజల్ట్ రాకపోతే ఐ మీన్ ఎలా చనిపోయాడో తెలియకపోతే unడిటర్మెంట్ చేస్తారు. చనిపోయిన మూడు రోజులు లోపు పోస్టుమార్టం నిర్వహించకపోతే ఆ డెడ్ బాడీ డీకంపోజర్ అయిపోతుంది. మళ్లీ ఆ డీకంపోస్ అయిపోయిన డెడ్ బాడీని పోస్టుమార్టం చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఏదైనా ఒక డెడ్ బాడీ పోస్టుమార్టంకి వచ్చినప్పుడు ముందుగా ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తారు. ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్లో డెడ్ బాడీ ఎలాంటి రూపంలో ఎలాంటి ఆకృతులతో వచ్చిందో అందరికీ సాక్ష్యధరంగా ఉండడానికి ముందుగా ఆ డెడ్ బాడీ యొక్క ఫోటోలు తీస్తారు. తర్వాత పోస్టుమార్టం స్టార్ట్ చేసే ముందు వీడియో రికార్డ్ ని స్టార్ట్ చేస్తారు. తర్వాత ఆ డెడ్ బాడీ పై ఉన్న టాటూలు మరియు పుట్టుమచ్చలు అన్ని రిపోర్ట్స్ లో రాస్తారు. తర్వాత షాంపుల్ కి బ్లడ్ మరియు చేతికి ఉన్న గోళ్ళని తీసుకుంటారు తర్వాత అలాగే కళ్ళలో ఉన్న లిక్విడ్ని తీసుకుని ల్యాబ్ కి పంపిస్తారు. ఇలా బ్లడ్ని మరియు కళ్లకున్న లిక్విడ్ ని పంపిస్తే అతడు డ్రగ్స్ ని కానీ ఆల్కహాల్ తీసుకున్నడో లేదో తెలుసుకోవచ్చు. దీనివల్ల ఎలా చనిపోయాడో essay గా తెలిసిపోతుంది. తర్వాత చేతికున్న వేళ్ళతో ఫింగర్ ప్రింట్ తీసుకుంటారు.ఒకవేళ డెడ్ బాడీ డీకంపోస్ట్ అయ్యి ఉంటే ఈ వీడియోలో చూపించిన విధంగా చేతికి ఉన్న స్కిన్ ని తొలగించి డాక్టర్స్ దానిని గల్వాజ్ మాదిరిగా చేతికి వేసుకుని ఒక పేపర్ మీద ఫింగర్ ప్రింట్స్ ని రిపోర్ట్స్ లో రికార్డ్ చేస్తారు. ఈ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ లో శాంపుల్ కి వెంట్రుకలను తీసుకుంటారు.

తర్వాత బాడీ మొత్తం స్కాన్ చేస్తారు. ఇలా స్కాన్ చేయడం ద్వారాఆ డెడ్ బాడీలో ఎక్కడ ఎలా డామేజ్ అయిందో తెలుసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి తన తలలో బుల్లెట్ ఉంది అనుకోండి. అప్పుడు ఈ స్కాన్ రిపోర్ట్స్ ద్వారా బుల్లెట్టు తలలో ఎక్కడ ఉంది అలాగే గన్ పౌడర్ ఎక్కడ దాకా చేరుకుందో ఈజీగా తెలుసుకోవచ్చు ఒకవేళ ఆ డెడ్ బాడీలో ఎముకలు విరిగిపోయి ఉంటే అది అలా హత్య చేయడం వలన జరిగిందా?లేకపోతే నాచురల్ గా ఎముకలు విరిగిపోయాయ? అనే విషయాలు తెలుస్తాయి.తర్వాత శరీరం మీద ఉన్న బట్టలన్నీ తొలగించి నగ్నంగా ఉంచుతారు.తర్వాత వీపు కింద ఒక రబ్బర్ లాంటి ఒక ఆబ్జెక్ట్ని పెట్టి చాతి బాగాన్ని పైకి లేపుతారు.మగవాళ్ళకి అయితే Y షేపులో బాడీని కట్ చేస్తారు అదే స్త్రీలకు అయితే U షేప్ లో కట్ చేస్తారు.ఆ తర్వాత దాని పైన ఉన్న చర్మాన్ని లేయర్ని తొలగిస్తారు.ఈ వీడియోలో చూపించిన విధంగా పూర్తిగా అవయవాలు కనిపించే విధంగా చేస్తారు.తర్వాత లార్వింగ్స్ ఫుడ్ పైపులను తొలగిస్తారు తర్వాత గుండె పేగులు స్టమక్ లను కట్ చేసి బయటకు తీస్తారు ఇలా బయటకు తీసిన అవయవాలను ఒక్కొక్కటిగా తీసుకుని,వాటి బరువులను లెక్కిస్తారు.

ఇలా ఎందుకు చేస్తారంటే అవయవాలలో తేడాలు ఉంటే డెడ్ బాడీ లో ఏమైనా వ్యాధులు ఉంటే గుర్తించడానికి సహాయపడతాయి అయితే కొన్ని కారణాల వల్ల అంటే పోస్టుమార్టం ద్వారా ఎలా చనిపోయాడో నిర్ధారణ కాకపోతే డాక్టర్లు ఆ అవయవాలను తమ దగ్గర పెట్టుకుని పరీక్షలు చేస్తారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ డాక్టర్లు తీసుకున్న అవయవాలను చెడిపోకుండా ఎలా చూసుకుంటారు అని?….. అయితే ఇక్కడ డాక్టర్లు అవయవాలను చెడిపోకుండా ఉండటానికి  ఫార్ములిన్ అనే లిక్విడ్ లోకి ముంచి చెడిపోకుండా చూసుకుంటారు. అయితే ఇప్పుడు చెప్పిందంతా ఎందుకు చేస్తారంటే? ఎలా చనిపోయాడో తెలుసుకోవడానికి ఇలా చేస్తారు.. మన ఇండియాలో పోస్టుమార్టం చేయాలంటే తిరస్కరిస్తారు అయితే దీనికి రెండు కారణాలు ఉన్నాయి.అవి నంబర్ వన్ చనిపోయిన వ్యక్తి యొక్క అంత్యక్రియలు చాలా ఆలస్యంగా జరుగుతాయి ఎందుకంటే పోస్టుమార్టం చేయడానికి రెండు నుంచి మూడు రోజుల దాకా సమయం పడుతుంది. నంబర్ టు పోస్టుమార్టం చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ రెండు కారణాల వలన పోస్టుమార్టం చేయడానికి తొందరగా ఎవరు ఒప్పుకోరు. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా డెడ్ బాడీకి పోస్టుమార్టం చేస్తారు. ఈ వీడియోలో కనుక నాకు ఎక్స్ప్రెషన్ నచ్చితే ఇప్పుడే ఒక లైక్ కొట్టేసేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నవీన్ కుమార్ సాయినింగ్ఆఫ్.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top