Why did the city of Dwarka sink? In our Telugu

హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామాలలో ద్వారకా ఒకటి ద్వారక అనగా అనేక ద్వారాలు కలది అని అర్థం, వేదవ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారావతిగా పేర్కొన్నారు దీనినే కృష్ణగిరి అని కూడా పిలిచేవారంట అయితే ఈ వీడియోలో అసలు శ్రీకృష్ణుడు మధుర నగరం ఎందుకు వదిలి వెళ్ళిపోయాడు ?అలానే ద్వారకా నగరం ఎందుకు సముద్రంలో మునిగిపోయింది ?దానికి గల కారణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి..

 

శ్రీ కృష్ణుడు మధుర వదిలి ద్వారకకు ఎందుకు వెళ్ళాడు ?

 

శ్రీ కృష్ణ భగవానుడి బాల్యం మధుర నగరంలో గడిచింది. కానీ కంసుడిని చంపిన తరువాత అతను మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్లి అక్కడ తన నగరాన్ని నిర్మించాడు. కంసుని బంధువు జరాసంధుడు చాలా శక్తివంతుడని చెబుతారు. కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి, కృష్ణుడి జన్మస్థలమైన మధురను కనుగొని, మధుర పై నిరంతరం దాడి చేయడం ప్రారంభించాడు. అతను శ్రీ కృష్ణుని చేతిలో పదే పదే ఓడిపోయాడు. అయినా అతను దాడి చేస్తూనే ఉన్నాడు.

 

మధుర పై 17 సార్లు దాడి….

 

జరాసంధుడు వరుసగా 17 సార్లు మధుర పై దాడి చేసి ఓడిపోయాడు. దీంతో మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు.   జరాసంధుడు కృష్ణుడిని ఓడించేందుకు చంపేందుకు నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు ఈ యుద్ధాల కారణంగా ఎంతో మంది మధురా నగర ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయేవారు ఇది గమనించిన కృష్ణుడు అన్నింటికంటే మొదటిగా తన మధుర నగర ప్రజలను కాపాడాలి ఆ తర్వాత జరాసంధుని సంగతి తేల్చాలి అని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం అతని నుంచి ప్రజలను రక్షించేందుకు ఒక కొత్త నగరాన్ని సముద్రానికి మధ్యలో కట్టాలి అని అక్కడికి ఈ ప్రజలను తరలించాలి అని భావించి సముద్రున్ని కాస్త భూమి ఇవ్వమని ఆదేశించాడు దాంతో సముద్రుడు వెనువెంటనే వెనక్కి జరిగి 12 యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడి కోసం ఇచ్చాడు ఆ భూభాగంలో కట్టిన నగరమే ఈ ద్వారకా నగరం ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం ఈ నగరంలో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవట ఈ ద్వారకా నగరాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే పాలించాడు ఒకానొక సమయంలో శ్రీకృష్ణ భగవానుడు తన శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ద్వారకా నగరం నీటిలో మునిగిపోయింది.

 

ద్వారకానగరం నీటిలో మునిగిపోవడానికి గల కారణాలు ఏమిటి…

 

అయితే దీని గురించి మన పురాణాల్లో రెండు కథలు ప్రచారంలో ఉన్నాయి మొదటిది గాంధారి శ్రీకృష్ణుడిని శపించడం రెండో కథ ప్రకారం ప్రకారం శ్రీకృష్ణుడి పుత్రునికి ఋషుల ద్వారా ఇవ్వబడిన శాపం…

 

1)ముందుగా గాంధారి శాపం గురించి తెలుసుకుందాం కురుక్షేత్ర సంగ్రాామం ముగిసిన తర్వాత పాండవులు శ్రీకృష్ణుడు హస్తినాపురానికి చేరుకున్నారని సంజయుడు గాంధారికి చెప్పాడు ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయిన నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావు విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చేయలేదని నిందిస్తుంది మీ తల్లి దేవకిని అడుగు బిడ్డలు పోయిన బాధ ఏంటో తెలుస్తుంది ఆమె ఏడుగురు పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది నేను నా నూరుగురు కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది

గాంధారి మాటలు విన్న కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి మిగతా కౌరవులకు కూడా చెప్పానని అంటాడు అప్పటికి ఆగ్రహం చల్లారని గాంధారి నా విష్ణు భక్తి నిజమైతే నా పతి భక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఎలాగైతే మా కురువ వంశం నాశనం అయిందో అలాగే నీ కళ్ళ ముందే నీ ఎదువంశం నీ ద్వారకా నగరం కూడా నాశనం అయిపోతుంది అంతేకాదు నీ ద్వారకా నగరం నేట మునిగిపోతుందని శపిస్తుంది శ్రీకృష్ణుడు ఆ శాపాన్ని స్వచ్ఛమైన మనసుతో స్వీకరిస్తాడు

తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని చేరుకుంటాడు..

 

2)ఇక రెండవ కథ ప్రకారం శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబుడు తన

మిత్రులతో ఆడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో విశ్వామిత్ర అంగీరస వశిష్ట దూర్వాస నారద మహర్షులు తమ శిష్యులతో శ్రీకృష్ణుని దర్శనమునకై ద్వారకా నగరానికి రాగా సాంబుడు మరియు అతని మిత్రుల యొక్క దృష్టి ఈ ఋషుల మీద పడుతుంది వాళ్ళు మధుర తాగి ఉండటం వలన వాళ్ళ వివేకం నశిస్తుంది ఈ ఋషులను ఆట పట్టించడానికి వారంతా సాంబునికి ఆడవేషము వేసి ఋషుల దగ్గరికి తీసుకువెళ్లి ఋషులను ఇలా అడుగుతారు ఈ స్త్రీ గర్భవతి తన గర్భం నుంచి ఏం పుడుతుంది అని వారు హాస్యంగా అడుగుతారు ఋషుల వారు తమని ఆటపడి పట్టించడానికే వచ్చారని అర్థం చేసుకొని కోపంతో ఆ కడుపు నుండి ఒక ముసలిం పుట్టి ఈ  యదు వంశం మొత్తాన్ని నాశనం చేస్తుందని ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోతుందని శపిస్తారు ఇది శ్రీకృష్ణుడికి తెలిసినప్పుడు అది ఋషుల మాట వారి మాటలు ఎప్పుడూ వ్యర్థం కావు అంటాడు ఆ తర్వాత రోజు సాంబునికి ముసలిం పుడుతుంది దీంతో భయపడిపోయిన సాంబుడు యాదవులతో కలిసి ఉగ్రసేన మహారాజు దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా వివరించగా ఆయన వెంటనే దానిని అరగదీసి సముద్రంలో పడేయమని చెప్పారు అలా అరగదీసిన తర్వాత ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది వాళ్ళు ఆ ముక్కను కూడా సముద్రంలో పడేసి వెళ్ళిపోతారు ఇక ఆ విషయం అంతటితో అందరూ మర్చిపోతారు జర అనే  వేటగాడికి ఆ ఇనుప ముక్క దొరుకుతుంది అతను ఆ ఇనుప ముక్కను తన బాణాల్లో ఒక దానికి బాణపు కొనగా ఉపయోగిస్తాడు అలాగే వారు ముసలాన్ని అరగదీసి సముద్రంలో పడేసిన పొడి కూడా మళ్ళీ తీరానికే కొట్టుకు వచ్చి ఏలుగడ్డిలా ఏర్పడుతుంది మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత 36 సంవత్సరాలకి ద్వారకా నగరంలో చాలా అపశకునాలు సంభవించాయి అందుకని యదు వంశ పురుషులందరినీ తీర్థయాత్రలకు వెళ్ళమని చెప్పారు అందుకని వారందరూ తీర్థయాత్ర కని ద్వారకా నగరం విడిచిపెట్టి సముద్ర తీరానికి రాగా వీళ్ళందరిలో ఏదో గొడవ ప్రారంభమై ఆ రేళ్లు గడ్డిని ఆయుధాలుగా చేసుకుని ఒకరినొకరు చంపుకుంటారు

అలా ఆ రూపంలో ఋషి యొక్క శాపం నిజమవుతుంది ఈ గొడవలో శ్రీకృష్ణుడు కొడుకు ప్రద్యుమ్నుడు సాంబుడు కూడా చనిపోతారు శ్రీకృష్ణుడు ఆ ప్రాంతానికి చేరుకుంటాడు చివరికి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు బలరాముడు అలాగే శ్రీకృష్ణుడి సారధి మాత్రమే మిగులుతారు అప్పుడు శ్రీకృష్ణుడు తన సారధిని అర్జునుడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు అర్జునుడిని తీసుకొని రమ్మని చెప్తాడు ఇక బలరాముడిని అక్కడే ఉండమని చెప్తాడు తన తండ్రికి ఈ విషయం చెప్పడానికి ద్వారక వెళ్ళిపోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు అతి తొందరలో ఇక్కడికి అర్జునుడు వస్తాడని అప్పటివరకు ఈ నగరంలో ఉన్న పురుషులు స్త్రీలను కాపాడమని వసుదేవుడికి చెప్తాడు మళ్ళీ శ్రీకృష్ణుడు బలరాముడు ఉన్న చోటికి వస్తాడు అక్కడ బలరాముడు ధ్యానవస్థలో ఉంటాడు బలరాముని ఆత్మ శేషనాగు రూపంలో సముద్రంలో లీనమవుతుంది ఇక చివరికి కృష్ణుడు తాను కూడా అవతారాన్ని చాలించాల్సిన సమయం వచ్చింది అనుకుంటాడు వెంటనే ద్వారకను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒక చెట్టు నీడలో విశ్రమిస్తాడు అటుగా వచ్చిన ఓ వే వేటగాడు పొదల మధ్యలో నుండి శ్రీకృష్ణుడి కాలివేలును చూసి ఒక జింక కన్నును భ్రమించి తనకు దొరికిన ఇనుప ముక్కతో చేసిన బాణం వేస్తాడు దీంతో శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని  చాలిస్తాడు అప్పుడు ఆ వేటగాడు హస్తినాపురానికి వెళ్లి విషయమంతా చెబుతాడు ఇంకోవైపు అర్జునుడు ద్వారక చేరుకుంటాడు అక్కడ రాణులను చూసి తన కళ్ళల్లో నీళ్లు వస్తాయి అర్జునుడు వసుదేవుడిని కలుస్తాడు వసుదేవుడు అర్జునుడిని చూసి విలపించడం ప్రారంభిస్తాడు తర్వాత అర్జునుడికి శ్రీకృష్ణుడి సందేశం గురించి చెబుతాడు కొంతకాలంలోనే ఈ నగరమంతా సముద్రంలో మునిగిపోతుంది ఇక్కడ వారినందరినీ తీసుకువెళ్ళమని చెప్పాడు వసుదేవుడు మాటలు విన్న తర్వాత అర్జునుడు రాజ్యంలోని మంత్రులందరినీ రమ్మని చెప్పాడు వారు వచ్చిన తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుని  సందేశం గురించి అలాగే అక్కడి వాళ్ళందరినీ హస్తినాపురానికి తీసుకొని వెళ్ళాలని అనుకుంటున్నట్లు చెప్పాడు ఇంకా కొద్ది రోజుల్లోనే ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోతుంది అని హెచ్చరిస్తాడు సరిగ్గా ఏడు రోజుల్లో వీళ్ళందరినీ హస్తినాపురానికి తీసుకువెళ్ళిపోవాలి అని చెప్తాడు దానికి కావలసిన ఏర్పాట్లు చేయమని చెప్పాడు ఆ మాట వినగానే మంత్రులందరూ అర్జునుడి ఆజ్ఞ పాటించడానికి వెళ్ళిపోతారు ఆ రోజు రాత్రి అర్జునుడు కృష్ణుని మహల్లోనే ఉంటాడు ఆ తర్వాత రోజు కృష్ణుని తండ్రి వసుదేవుడు కూడా ప్రాణత్యాగం చేస్తాడు అర్జునుడు వసుదేవునికి సాంప్రదాయం ప్రకారం అంతిమ

సంస్కారాలు చేయిస్తాడు వసుదేవుని భార్యలైన దేవకీ భద్ర రోహిణి మరియు మధురలు కూడా ప్రాణత్యాగం చేస్తారు తర్వాత అర్జునుడు చనిపోయిన యదు వంశీయులందరికీ తగిన విధంగా అంతిమ సంస్కారాలు చేయిస్తాడు సరిగ్గా ఏడవ రోజు అర్జునుడు శ్రీకృష్ణుని పరిజనాన్ని అలాగే నగరవాసులందరినీ కూడా తీసుకువెళ్లి హస్తినాపురానికి బయలుదేరుతాడు ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం గర్జించింది పిడుగులు తోక చుక్కల ద్వారకపై కురిసాయి సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్ర రూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనలో కలుపుకుంది ఇలా ఈ విశ్వ విఖ్యాత నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది ఈ ద్వారకా నగర సమాచారం అంతా కూడా భారతం భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది ఇలా ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన 36 సంవత్సరాల తర్వాత సముద్రంలో కలిసిపోయింది

 

 

మనం సముద్రం లోపలికి వెళ్లి ఏమేం చూడవచ్చు?

 

కోల్పోయిన ద్వారక నగరాన్ని వెలికితీయాలనే తపన 20వ శతాబ్దంలో తీవ్రంగా ప్రారంభమైంది. 1960వ దశకంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) మొదటి ముఖ్యమైన పురావస్తు యాత్రను నిర్వహించింది. ఏది ఏమైనప్పటికీ, 1980ల ప్రారంభం వరకు ప్రస్తుత ద్వారక సమీపంలో మునిగిపోయిన నగరం యొక్క గణనీయమైన నీటి అడుగున ఆధారాలు కనుగొనబడలేదు.

 

1. సముద్రపు పురావస్తు తవ్వకాలు: 1983లో డాక్టర్ ఎస్.ఆర్. రావ్, ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త, ద్వారక తీరానికి సమీపంలో నీటి అడుగున అన్వేషణలు నిర్వహించారు. కనుగొన్న విషయాలు చెప్పుకోదగ్గవి ఏమీ లేవు. గోడలు, బురుజులు మరియు వీధుల గ్రిడ్‌తో సహా భారీ రాతి నిర్మాణాలతో బాగా ప్రణాళిక చేయబడిన నగరం యొక్క అవశేషాలను బృందం కనుగొంది. ఈ పరిశోధనలు పురాతన గ్రంథాలలో కనిపించే వర్ణనలకు సరిపోయే నగరం ఉనికిని సూచించాయి. తదుపరి అన్వేషణలు రాతి యాంకర్ల యొక్క విస్తృతమైన నెట్‌వర్క్‌ను వెల్లడించాయి, ద్వారక బాగా అభివృద్ధి చెందిన సముద్ర వాణిజ్యంతో అభివృద్ధి చెందుతున్న ఓడరేవు నగరమని సూచిస్తుంది. ఈ వ్యాఖ్యాతల ఉనికి, కుండలు మరియు ఇతర కళాఖండాలతో పాటు, నగరం ఒక సందడిగా వాణిజ్య కేంద్రంగా ఉందని సూచిస్తుంది.

 

2. అలల క్రింద నిర్మాణాలు: ద్వారక సమీపంలో కనిపించే నీటి అడుగున నిర్మాణాలు పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి, కొన్ని 40 మీటర్ల లోతులో ఉన్నాయి. నగరం ఆరు విభాగాలపై నిర్మించబడినట్లు కనిపిస్తుంది, ప్రతి ఒక్కటి కోటలచే రక్షించబడింది. నిర్మాణంలో ఉపయోగించిన భారీ రాళ్లు అధునాతన ఇంజనీరింగ్ నైపుణ్యాలను సూచిస్తున్నాయి, సాంకేతికత మూలాధారంగా ఉన్న యుగంలో అటువంటి నగరాన్ని నిర్మించడానికి ఇది అవసరం. చాలా ముఖ్యమైన ఆవిష్కరణలలో ఒకటి నీటిలో మునిగిన దేవాలయం యొక్క అవశేషాలు, ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిందని చాలామంది నమ్ముతారు. ఆలయ నిర్మాణం, శతాబ్దాల తరబడి మునిగిపోయినప్పటికీ, ద్వారక ఒకప్పుడు ప్రసిద్ధి చెందిన వైభవాన్ని ప్రతిబింబిస్తుంది….

 

ఇదంతా ఇలా ఉంటే ,శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరాన్ని ప్రజలు వీక్షించేలా గుజరాత్ ప్రభుత్వం ఓ కీలక ప్రణాళికను వేసింది. అరేబియా సముద్రంలో 300 అడుగుల లోతులో ఉన్న ద్వారకా నగరాన్ని భక్తులకు చూపించేలా సబ్‌మెరైన్‌ సర్వీసులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి ద్వారకా సబ్‌మెరైన్ టూరిజం ప్రాజెక్టును చేపట్టనున్నట్లు గుజరాత్ సర్కార్ వెల్లడించింది. దీని కోసం ముంబైకి చెందిన ప్రభుత్వ రంగ నౌకా సంస్థ మజ్‌గావ్ డాక్‌తో కలిసి ఒప్పందం చేసుకుంది. ద్వాపర యుగం తర్వాత అరేబియా సముద్రంలో మునిగిన ఈ పురాతన నగరాన్ని సందర్శించే గొప్ప అవకాశాన్ని కల్పించేంద వ్యక్తం చ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Translate »
Scroll to Top